వీడు మనిషా.. మృగమా..తల్లినే సంపిండు - MicTv.in - Telugu News
mictv telugu

వీడు మనిషా.. మృగమా..తల్లినే సంపిండు

February 2, 2018

తొమ్మిది నెలలు మోసి గుల్లెడు పేగుల్లోంచి జన్మనిచ్చిన కన్నతల్లి రుణాన్ని ఓ కసాయి కొడుకు ఇలా తీర్చుకుంటున్నాడు. ఆ తల్లికి పక్షవాతం.. తనకు తాను నడవలేదు, తన పనులు తాను చేసుకోలేని నిస్సహాయ పరిస్థితి. కడుపుకు అన్నం కూడా సరిగ్గా పెడుతున్నారో లేదో బలహీనంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో కన్న కొడుకు ఆమెకు చెట్టంత అండగా నిలవాల్సింది పోయి ఇలా ఆమెను ఎటు పడితే అటు కొడుతున్నాడు. అలా కన్నతల్లిని కొట్టడానికి వాడికి చేతులెలా వచ్చాయో.. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. తండ్రి చనిపోవడంతో కొడుకు దగ్గరే వుంటోంది ఆ తల్లి.


కొడుకు జోగేంద్ర చౌదరి స్థానిక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇంట్లో భార్యా భర్తలకు తరచూ గొడవలు అవుతుండటంతో ఆ కోపాన్నంతా ఇలా నిస్సహాయ తల్లి మీద తీర్చుకున్నాడీ కీచక కొడుకు. తన రక్తాన్ని పంచుకొని పుట్టిన కసాయి కొడుకు చేతుల్లో చేతకాని ఆ తల్లి తనువు చాలించింది. కన్న కొడుకే ఆమె మరణ శాసనాన్ని రాశాడు.

ఎటు పడితే అటు గొడ్డును బాదినట్టు బాదటం వల్ల ఆ తల్లి తొమ్మిది రోజుల క్రితం మరణించింది. ఇలా తనను పెద్దయ్యాక కొడుకు నరకం చూపిస్తాడని ఆ తల్లికి వాడు పుట్టినప్పుడే తెలిసుంటే అప్పుడే గుప్పెడు గింజలు గొంతులో పోసి చంపేసినా బాగుండేది అంటున్నారు నెటిజనులు. కానీ ఏ కన్నతల్లీ అలా చెయ్యదు. ఈ వీడియో చూసిన వారంతా అయ్యోపాపం ఆ తల్లిని మాకిచ్చిన సొంత బిడ్డలా చూసుకునేవాళ్ళమని అంటున్నారు.

ఈ లెక్కన  కన్న కొడుకుల కంటే వృద్ధాశ్రమాలే నయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ ఇలా కన్నవాళ్ళను హింసించే లత్కోర్ నా కొడుకులు ముసలి వాళ్ళు కారా ? వాళ్ళకు పుట్టిన వాళ్ళు కూడా ఇలాగే వాళ్ళకు నరకం చూపించరా ? ’ అంటున్నారు.

తన తండ్రి నానమ్మను కొడుతున్నది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు మనవడు. దీంతో ఈ ఘోరం బయటకు వచ్చింది. సోషల్ మీడియా రాక మునుపు ఇలాంటి దారుణాలు ఎన్ని జరిగాయో. సోషల్ మీడియా పుణ్యామా అని ఇలాంటి దురాగతాలు బయటకు వస్తున్నాయంటున్నారు చాలా మంది.