మళ్లీ తాత అయిన బాలయ్య - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ తాత అయిన బాలయ్య

March 24, 2018

సీనియర్ నటుడు బాలకృష్ణ మరోసారి తాత అయ్యారు. మనవరాలు పుడుతుందని ఆశపడ్డ బాలయ్య దంపతులకు మళ్లీ మనవడే తోడయ్యాడు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండో మనవడి రాకతో బాలయ్య ఇంట్లో ఆనందాలు వెల్లివిరిసాయి. బాలయ్య ఆనందంలో మునిగిపోయారని, తన సన్నిహితులకు, సిబ్బందికి స్వీట్లు పంచినట్లు సమాచారం.

కుటుంబ సభ్యులంతా తేజ్వస్విని, బాబును చూసేందుకు వెళ్లారు. తేజస్విని వివాహం గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు ఎంవివిఎస్ మూర్తి మనవుడు శ్రీభరత్‌తో 2013లో జరిగిన సంగతి తెలిసిందే. బాలయ్య పెద్ద కుమార్తె బ్రహ్మణి వివాహం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో వివాహం  జరగగా వారికి ఓ కొడుకు వున్నాడు. ఇటీవలే మనవడు దేవాన్ష్ మూడవ పుట్టినరోజు వేడుకలను చంద్రబాబు ఘనంగా  జరిపారు.