కన్న బిడ్డలను దారుణంగా హత్య చేసిన తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

కన్న బిడ్డలను దారుణంగా హత్య చేసిన తండ్రి

April 17, 2018

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానవత్వానికే మచ్చ తీసుకువచ్చాడు ఓ కసాయి తండ్రి. ముక్కుపచ్చలు అరని పిల్లలను అతి దారుణంగా హత్య చేసి వారి పాలిట కాలయముడు అయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకున్న అతడు భార్యా బిడ్డలను చంపాలనుకున్నాడు కానీ భార్య తప్పించుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొమరంభీం ఆసిఫాబాద్‌కు చెందిన అశోక్ నికోడె వృత్తిరీత్యా దినసరి కూలీ. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దర్శనానికి వెళ్ళారు. రాత్రి అక్కడే వున్నారు. భార్య లక్ష్మి కాలకృత్యాలు తీర్చుకోవటానికి పొదల చాటుకు వెళ్ళినప్పుడు ఒక పాప మెడకు ప్లాస్టిక్ తాడుతో బిగించి చంపేశాడు. రెండో పాపను చంపుతుండగా భార్య చూసి అరిచింది. అప్పటికే రెండో పాపను కూడా చంపేశాడు.భార్య మెడకు కూడా తాడు బిగించాడు. లక్ష్మీ స్పృహ తప్పి పడిపోయింది. చనిపోయింది అనుకుని అక్కడినుంచి పరారయ్యాడు అశోక్. చాలా సేపటికి మెలకువలోకి వచ్చిన లక్ష్మీ అక్కడ తన పిల్లలు కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అడవిలో గాలించగా ఒక పాప శవం లభించింది. ఇంకొక పాప కోసం గాలిస్తున్నారు.  హత్యకు గురైన చిన్నారుల పేర్లు, మొదటి అమ్మాయి అంజలి కాగా రెండవ అమ్మాయి అక్షితగా గుర్తించారు పోలీసులు. ఆ కసాయి తండ్రికి తన భార్యపై అనుమానం మరియు కుటుంబ కలహాలు ఈ హత్యలకు కారణంగా తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. పిల్లల హత్యపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.