సింహాన్ని కలవాలని వంగివంగి వెళ్లాడు.. తర్వాత.. - MicTv.in - Telugu News
mictv telugu

సింహాన్ని కలవాలని వంగివంగి వెళ్లాడు.. తర్వాత..

February 22, 2018

ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు పారిపోతాం, సాహసం చేసైనా ప్రాణాలను కాపాడుకుంటాం. కానీ ఇతణ్ణి చూడండి ప్రాణాలను లెక్క చెయ్యకుండా ఎలా సింహం ఎన్‌క్లోజర్‌లోకి  వెళ్తున్నాడో. పిచ్చి పీక్‌కు చేరిందనటానికి ఇంతకన్నా నిదర్శనం వేరే వుంటుందా? సింహం ముందుకెళితే ముద్దుపెట్టి, మురిపాలు పంచి తిరిగి వెనక్కి పంపిస్తుందనుకున్నాడేమో.. దానిలా పాక్కుంటూ పాక్కుంటూ ఎంత లాలనగా వెళ్తున్నాడో మహానుభావుడు.

‘ఆహాహా.. ఈ జూవాళ్ళు నన్నిక్కడికి తెచ్చి ఇందులో బంధించి ఎంగిలి ఏలికలు పీలికల మాంసం వేసి నా కడుపు మాడ్చుతున్నారు. ఇవాళ మాంచి బలిసిన నరరూప దుప్పియే నా దగ్గరకు నడిచొస్తోంది’ అని కోరలు చాచుకుంటున్నట్టుంది సింహం పరిస్థితి.

ఇంకాస్తైతే సింహానికి బిర్యానీ అవాల్సిన వాడు బతికి బట్టకట్టాడు. బహుశా ఇతను ఆ జూ సిబ్బంది చొరవ వల్ల పునర్జన్మ ఎత్తినట్టే అయింది. కేరళలోని తిరువనంతపురం జూపార్కులో జరిగింది ఈ ఘటన. కొన్నాళ్ళ క్రితం ఢిల్లీలో ఓ యువకుడు సెల్ఫీ మోజులో పడి ప్రమాదవశాత్తు పులి ఎన్‌క్లోజర్‌లో పడి దానికి ఆహారం అయ్యాడు. మరో ఘటనలో ఓ ఆస్తికుడు దేవుడి పేరు చెప్తూ సింహానికి ఎదరెళ్ళాడు. అది కిస్కో నై జాన్తా అని పంజా విసిరింది.

జూ సిబ్బంది ముందు జాగ్రత్తలో వుండి దానికి మత్తు ఇంజక్షన్లు ఇవ్వడంతో సరిపోయింది. లేదంటే నమ్ముకున్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. పశువు, మృగం ఒకటే అనుకుంటున్నారు ఇలాంటివాళ్ళు. క్రూర జంతువులో సాధు స్వభావాన్ని చూడాలనుకుంటున్న ఇలాంటి మూర్ఖపు మనుషులు ఎప్పుడు మారుతారో..!