నమ్మి ఇంటికొచ్చిన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను చంపేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

నమ్మి ఇంటికొచ్చిన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను చంపేశాడు

February 19, 2018

ఫేస్‌బుక్ స్నేహాలను అస్సలు నమ్మొద్దని ఎంత మొత్తుకున్నా వింటారా జనాలు! నమ్మి పోతున్నారు.. చక్కా మోసపోతున్నారు, వంచనకు గురవుతున్నారు, బ్లాక్ మెయిల్‌కు సైతం గురవుతున్నారు. కానీ ఈ సంఘటనలో ఓ యువతి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను నమ్మింది.. అతను ఆమె నుండి శారీరక సుఖాన్ని కోరాడు.. అందుకామె నిరాకరించేసరికి ఆమెను హత్య చేశాడు.తూర్పు ముంబైకి చెందిన హ‌రిదాస్ నిర్గుడేకి,  ముంబైలోని వాసి ప్రాంతానికి చెందిన అంకిత (20)కు ఫేస్‌బుక్ ద్వారా కొన్ని నెల‌ల క్రితం ప‌రిచ‌య‌మైంది. మాట‌ల‌తో మాయ చేసి ఆమెతో హ‌రిదాస్ స్నేహం కొనసాగించాడు. ‘ ఇలా ఎంతకాలం చాటింగ్‌లు చేసుకుందాం.. ఒకసారి ప్రత్యక్షంగా మాట్లాడుకుందాం.. మా ఫ్లాట్‌కి రా ’ అని ప్రపోజల్ పెట్టగానే ఆ అమ్మాయి నమ్మింది.

మంచివాడన్న నమ్మకంతో ఆదివారం సాయంత్రం అతని ఫ్లాట్‌కు వెళ్లింది. ఫ్లాట్‌కు వెళ్ళిన కొద్దిసేపు ఆమాటా ఈమాటా కలిపాడు. తర్వాత ఆమెతో సెక్స్ చెయ్యాలన్నాడు. అందుకు ఆ యువతి ససేమిరా అంది. ఎలాగైనా కావాల్సిందేనని శృంగారం కోసం బలవంతం చేశాడు. ఆమె నిరాకరిస్తోందని ఆగ్రహంతో షూలేస్‌ను ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం శవాన్ని అపార్ట్‌మెంట్ మెట్లపై పడేశాడు. శవాన్ని చూసిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా ఆమె హరిదాస్ స్నేహితురాలని తేలడంతో అతణ్ణి అరెస్ట్ చేశారు.