సినిమాకు వెళ్ళి శవమయ్యాడు - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాకు వెళ్ళి శవమయ్యాడు

March 22, 2018

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరూ ఊహించలేరు అనటానికి ఈ ఘటనే ఉదాహరణ. సరదాగా సినిమాకు వెళ్ళిన అతను సీట్ల మధ్య తల ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో స్టార్‌ సిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని వ్యూ సినిమా థియేటర్‌లో చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్‌ మెయిల్‌ పత్రిక కథనం ప్రకారం.. వ్యూ థియేటర్‌లో ‘గోల్డ్‌ క్లాస్‌’‌ లగ్జరీ సీట్లలో కూర్చుని సినిమా చూస్తున్నాడా వ్యక్తి. ఇంతలో అతని సెల్‌ఫోన్ కింద పడిపోవటంతో తీసుకోవటానికి క్రిందికి వంగాడు.ఇంతలో ఒక్కసారిగా అతని సీటుకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఫుట్‌రెస్ట్‌ తలపై పడింది. తల దాని కింద ఇరుక్కుపోయింది. వెంటే వున్న అతని భార్య సహా థియేటర్ సిబ్బంది చాలా శ్రమించారు. చివరికి సీటు కాలు విరగ్గొట్టి అతణ్ణి బయటకు తీశారు. తీవ్ర గాయాలైన అతణ్ణి ఆసుపత్రికి తరలించారు. కుర్చీలో ఇరుక్కున్నప్పుుడు అతనికి గుండెపోటు కూడా వచ్చినట్టు డాక్టర్లు దృవీకరించారు. మార్చి 9న థియేటర్‌లో తల ఇరుక్కుపోగా మార్చి 16న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అక్కడి ఆరోగ్య పరిరక్షణ విభాగంతో పాటు థియేటర్ యాజమాన్యం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.