ఉగ్రవాదుల కన్నా గుంతలే చాలా డేంజర్… సుప్రీంకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

ఉగ్రవాదుల కన్నా గుంతలే చాలా డేంజర్… సుప్రీంకోర్టు

December 6, 2018

ఊరు ఎలాంటిదో చెప్పాలంటే ముందు రోడ్డు చూడాలన్నట్టే వుంది ప్రస్తుతం మనదేశంలోని రోడ్ల పరిస్థితి? గుంతల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలా మంది చనిపోతున్నారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల కన్నా ఈ గుంతలు చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్లపై  రహదారులపై గుంతల కారణంగా దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 14,926 మంది మృత్యువాత పడటం అత్యంత బాధాకరమని కోర్టు వాపోయింది.Telugu news Heal the terrorists .. The Pits is very dangerous ... the Supreme Court‘ఈ గుంతల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. బహుశా సరిహద్దుల్లో, ఉగ్రవాదుల చేతుల్లో చనిపోతున్న వారి కంటే గుంతల కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారేమో. 2013 నుంచి 2017 సంవత్సరం వరకు ఏటా రహదారులపై ప్రమాదకరంగా ఉండే గుంతల కారణంగా చనిపోతున్నవారి సంఖ్య చూస్తుంటే బాధేస్తోంది. రహదారుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది’ అని అని జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కేఎస్‌ రాధకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీ రహదారి భద్రతపై దాఖలు చేసిన నివేదికపై కేంద్రం వెంటనే స్పందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరికి తదుపరి విచారణను వాయిదా వేసింది.