కరివేపాకుతో తెల్లజుట్టు రాదట - MicTv.in - Telugu News
mictv telugu

కరివేపాకుతో తెల్లజుట్టు రాదట

December 14, 2017

ప్రతి వంటలో కరివేపాకును వేస్తుంటాం. దాని వలన కూరకు మంచి రుచి వస్తుంది. కానీ చాలా మంది కరివేపాకు తినాడానికి ఇష్టపడరు. కానీ కరివేపాకును తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?ముఖ్యంగా శిరోజాల సంరక్షణకు  చాలా ఉపయోగం పడుతుందట.

  1. కరివేపాకు మంచి హెయిర్ టానిక్‌గా ఉపయోగపడుతుంది. కరివేపాకు ఆకులు , కొబ్బరినూనెను ఒక గిన్నెలో తీసుకుని, రెండిటంటని కలపి నలుపు రంగు మిశ్రమం అయ్యే వరకు మరగించాలి. చల్లారాక జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 1 గంట తరువాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే వెంట్రుకలు త్వరగా పెరిగి జుట్టు తెల్లబడనీయకుండా ఉంటుంది.
  1. కొద్దిగా కరివేపాకు ఆకులు తీసుకుని వాటిని మెుత్తంగా పేస్ట్ లా చేసి, దానిలో గడ్డ పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. 20 నుంచి 25 నిమిషాల  తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరిగి, ప్రకాశవంతంగా, మృదువు ఉంటుంది.