ఉపవాసం మంచిదే.. సైంటిఫిగ్గా తేలింది! - MicTv.in - Telugu News
mictv telugu

ఉపవాసం మంచిదే.. సైంటిఫిగ్గా తేలింది!

March 13, 2018

లంకణం పరమఔషధం అని పెద్దలు అంటారు. శాస్త్రవేత్తలు కూడా ఇదే నిజమని చెబుతున్నారు.ఉపవాసంతో ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా ఆధ్యయనంలో తెలింది. ఉపవాసం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని వెల్లడైంది. శరీరానికి అవసరమైన కేలరీలకంటే  40 శాతం తక్కువ ఆహారం(కొవ్వులేని) తీసుకున్న ఎలుకల మెదడు కణాల్లో వాపు (ఇన్ఫ్లమేషన్) తగ్గినట్లు గుర్తించారు.

కొవ్వు తక్కువ ఉంటే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మెదడు కణజాలం పనితీరు బాగా ఉంటుందని గ్రొనిజెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ డాక్టర్ బార్ట్ ఈగెన్ తెలిపారు. వ్యాయామం కంటే కేలరీలను తగ్గించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని చెప్పారు.

మెదడు కణాల వాపు సోరియాసిస్‌, డిమెన్షియా సహా పలు వ్యాధులకు దారితీస్తుంది. వయసు రీత్యా వచ్చే అనర్థాలను తగ్గించుకుని మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బెర్రీస్‌, తాజా కూరగాయలు, నట్స్‌, చేపలు, సముద్ర ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.