మనసున్న మాజీ అధ్యక్షులు - MicTv.in - Telugu News
mictv telugu

మనసున్న మాజీ అధ్యక్షులు

October 23, 2017

అధికారంలో లేకపోయినా హృదయం వున్నదని నిరూపించారు అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్, జార్జి. పార్టీలకతీతంగా వారు మానవత్వంతో ముందుకొచ్చారు. ఈమధ్య అమెరికాను అతలాకుతలం చేసిన తుపాను  బాధితులను ఆదుకోవడానికి వారు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. బాధితుల సహాయార్థం విరాళాలు అందించి తమ సహృదయతను చాటారు.

టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన కాలేజి స్టేషన్‌లో ఒక సంగీత విభావరి నిర్వహించారు.  టెక్సాస్, ఫ్లోరిడా, లూసియానా, ప్యూర్టారికో, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌లలో తుపాన్లు భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వీటివల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే అమెరికా కోలుకుంటున్నది. బాధితులందరి కోసం విరాళాలు సేకరించారు.