జూబ్లీహిల్స్ రోడ్ నెం.48లో భారీ పేలుడు - MicTv.in - Telugu News
mictv telugu

జూబ్లీహిల్స్ రోడ్ నెం.48లో భారీ పేలుడు

February 12, 2018

జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 48 లో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా జనాలందరూ భయాందోళనలతో పరుగులు తీశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 48లోని ఓ పారిశ్రామిక వేత్త ఇంటి నిర్మాణం కోసం స‍్థలంలో జలిటిన్‌ స్టిక్స్‌తో పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్ల దాటికి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. పేలుడు సందర్భంగా భారీ శబ్దం రావడంతో స్ధానికులు భయంతో బెంబేలెత్తారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. అదేవిధంగా బాంబు స్వ్కాడ్‌ తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.