తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం… రూ.100 కోట్ల ఆస్తినష్టం..

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణి దగ్గర ఈ ఘటన జరిగింది. ఆటో మొబైల్స్ కంపెనీలో ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 2:30 గంటల నుంచి మంటలు ఆర్పడానికి 20 ఫైరింజన్లు వచ్చాయి. సుమారు రూ.100 కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.Telugu news Heavy fire in Tamil Nadu ...Rs 100 crore property lossఈ ఆటో మొబైల్ కంపెనీలో కారు స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారు. దాదాపు 1500 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో 50 మంది కార్మికులు మాత్రమే పనిలో వున్నారని అధికారులు అంచనా వేశారు. ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం అందలేదు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదా మరేదైనా కారణం వుందా తెలియాల్సి వుంది.