కుక్కే ఆ కుటుంబాన్ని కాపాడింది..

కేరళలో కురుస్తున్న వర్షం నదులు పొంగి పొర్లుతున్నాయి. కొండచరియలు విగిపడుతున్నాయి. ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు. వీరిలో 25 మంది కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇలాంటి ఘటన నుంచి ఓ కుటుంబాన్ని కాపాడింది ఓ పెంపుడు కుక్క. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కేరళలోని కంజికూజిలో గురువారం జరిగింది.

Dog saves her owner family

గురువారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో తీవ్రంగా వర్షం కురుస్తోంది. దీంతో పక్కనే ఉన్న కొండచరియలు విరిగిరిపడుతుండటంతో మోహనన్‌ అనే వ్యక్తి తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్క అది చూసి అరవడం మొదలుపెట్టింది. కుక్క అరుపులతో నిద్రలేచిన మోహనన్ మొదట పట్టించుకోలేదు.. దీంతో కుక్క ఇంకా గట్టిగా అరవడం మొదలు పెట్టింది.

దీంతో బయటకు వచ్చి చూశాడు. దీంతో కొండచరియలు ఇంటి ముందు పడ్డాయి. వర్షపునీరు ఇంటి చుట్టూ చేరింది. వెంటనే మోహనన్‌ కుటుంబ సభ్యులందరిని తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత స్థావరాలకు వెళ్లిపోయారు. వరద ఉద్ధృతి మోహనన్ ఇల్లు పూర్తిగా నీటమునిగింది. కుక్కలేకపోతే కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయేవని మోహనన్ తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు కుక్కను ప్రత్యేక హోమ్ కు తరలించారు.