8 గంటలకంటే ఎక్కువ నిద్రపోతే..అంతే..! - MicTv.in - Telugu News
mictv telugu

8 గంటలకంటే ఎక్కువ నిద్రపోతే..అంతే..!

December 4, 2017

కొందరు  ఏకాస్త  సమయం దొరికినా చాలు నిద్రపోతారు. అయితే ఎక్కువ సమయం నిద్రపోవడం మంచిది కాదని వైద్య పరిశోధనల్లో తేలింది. ఎక్కువ సమయం నిద్రపోతే గుండె సంబంద వ్యాధులు, మధుమేహం తదితరాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. అదేపనిగా అస్తవ్యస్తంగా నిద్రపోవడం వల్ల చర్మం మీద ముడతలు వస్తాయని లండన్‌కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ సమయం పడుకుంటే మంచి రిలాక్సేషన్ వస్తుందని అనుకుంటారు. అయితే తాజాగా జరిపిన పరిశోధనల్లో నిద్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ పరిశోధనలు చేసిన వైద్యుడు లారెనా ఓబర్గ్ మాట్లాడుతూ…అస్తవ్యస్తంగా పడుకోవడం వలన చర్మంపైన అధికంగా ముడతలు ఏర్పడుతాయని చెప్పారు. ఫలితంగా త్వరగా ముసలివారు అవుతున్నట్టు కనిపిస్తారు. వెల్లకిలా పడుకుని చేతులు తిన్నగా ఉంచి నిద్రపోవడం మంచిదని తెలిపారు.

బోర్లా పడుకోవడం, చేతులను అస్తవ్యస్తంగా పెట్టుకుని నిద్రపోవడం మంచిది కాదని హెచ్చరించారు. పడుకునే ముందు మంచినీటితో ముఖాన్ని కడుక్కుంటే చాలని, దీనివలన చర్మం కాంతివంతంగా,ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ముఖం కడుకున్న తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీం రాయడం మంచిదికాదు. చర్మం ప్రకృతి సిద్దంగానే సంరక్షణ స్వభావాన్ని కల్గింటుందని తెలిపారు