లంబసింగిలో11డిగ్రీల ఉష్ణోగ్రత - MicTv.in - Telugu News
mictv telugu

లంబసింగిలో11డిగ్రీల ఉష్ణోగ్రత

October 31, 2017

విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. లంబసింగిలో 11, చింతపల్లిలో 13 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతి ఏడాది శీతాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తుంటాయి.ఈప్రాంతంలో విపరీతమైన చలి ఉంటుంది.

ఉదయం పూట మొత్తం మంచుతో కప్పబడి ఉన్నట్లుగా ఉంటుంది. అంతేగాక మధ్యాహ్నం 12 గంటలు అయినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంటుంది. అయితే అక్టోబర్ చివరి వారంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. ప్రతి ఏడాది నవంబర్ చివరి వారం, డిసెంబర్, జనవరిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఈ ఏడాది ముందుగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో,చలిపులి చంపేసేటట్లుగా ఉందని పలువురు భావిస్తున్నారు.