హలో టీజర్‌కు యూట్యూబ్ షాక్.. - MicTv.in - Telugu News
mictv telugu

హలో టీజర్‌కు యూట్యూబ్ షాక్..

November 30, 2017

అక్కినేని అఖిల్ రెండో సినిమా ‘హలో’ విడుదల కాకముందే వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మధ్యే విడుదలైన టీజర్‌ను యూట్యూబ్ తొలగించింది. దీనిపై యువహీరో అఖిల్ తన ట్విటర్ ద్వారా స్పందించాడు.‘ హలో సినిమా టీజర్ కాపీరైట్ ఉల్లంఘన అంటూ వస్తున్న ఆరోపణలపై నిర్మాతలుగా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మాపై వున్నది. మా సినిమాకు ‘ రియల్లీ స్లో మోషన్ మ్యూజిక్ ’ మంచి నేపథ్య సంగీతాన్నిందించింది. అదే మేం చేసిన పాపమన్నట్టు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడంలేదు. 8 మిలియన్లకు మించిన వీక్షణలు వచ్చిన మా సినిమా టీజర్‌ను ఇలా అర్ధాంతరంగా తొలగించడం సరికాదు ’ అంటూ టీజర్ లింకును షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు అఖిల్.

కాగా యూట్యూబులో 6 మిలియన్లు పైబడిన అదే టీజర్ ప్రస్తుతం వున్నది. మనం సినిమా దర్శకుడు విక్రమ్. కె. కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా, కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌గా నటిస్తున్నది. రమ్యకృష్ణ, జగపతిబాబు అఖిల్‌కు అమ్మానాన్నలుగా నటించడం విశేషం.