యాభై వేల హెల్మెట్ అతని ప్రాణం తీసింది! - MicTv.in - Telugu News
mictv telugu

యాభై వేల హెల్మెట్ అతని ప్రాణం తీసింది!

December 15, 2017

హెల్మెట్ ప్రాణాలు కాపాడుతుందని మనందరికీ తెలుసు కానీ..రాజస్థాన్ జైపూర్‌లో ఓ ఖరీదైన హెల్మెట్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. జైపూర్‌కి చెందిన రోహిత్(30) జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ షోరూంలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.

అయితే ఈరోజు బైక్‌పై వెళుతుండగా  యూటర్న్ తీసుకుంటున్న మరో బైక్ ను తప్పించబోయి కిందపడిపోయాడు. బైక్ చాలా స్పీడు ఉండడంలో రోహిత్ అమాంతం ఎగిరిపడ్డాడు. వెంటనే అక్కడున్న స్థానికులు అతని కాపడడానికి ప్రయత్నించారు.

రోహిత్ తలకు ఉన్న హెల్మెట్‌ను తీసేందుకు ఎంత ప్రయత్నించినా.. అది లాక్ అవడంతో తీయడానికి వీలు కాలేదు. అలాగే దగ్గరిలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు హెల్మెట్ కత్తిరించి చికిత్స చేసే లోపే అంతా అయిపోయింది. అతను బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. యాభై వేల రూపాయల హెల్మెట్ లాక్ కావడంతో చివరికి హెల్మెట్టే అతని పాలిట కాలయముడిగా మారింది.