హీరో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ళ జైలుశిక్ష.. - MicTv.in - Telugu News
mictv telugu

హీరో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ళ జైలుశిక్ష..

April 21, 2018

ఎటూ తను బ్యాంకు ఉద్యోగినే కాబట్టి నేనేం చేసినా తెలియదు అనుకుని తప్పు చేశాడు. చట్టం ఎవ్వర్నీ వదలదు అన్నట్టే అతణ్ణి కటకటాల వెనకకు నెట్టింది. ఆ పెద్దమనిషి ప్రముఖ టాలీవుడ్ యువహీరో రాజ్ తరుణ్ కన్నతండ్రి అవడం గమనార్హం. 2013 లో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్‌ క్యాషియర్‌గా విధులు నిర్వహించారు బసవరాజు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందన్నట్టు అప్పట్లోనే తన భార్య రామలక్ష్మితో పాటు పలువురి పేర్ల మీద నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రూ.9.85లక్షల రుణాన్ని తీసుకున్నారు.మోసం ఎక్కువ రోజులు దాగదు అన్నట్టే ఆయనగారి మోసాన్ని బ్యాంకు వాళ్ళు కనిపెట్టారు. బ్యాంకు అధికారులు చేసిన ఆడిట్ తనిఖీల్లో అతను కుదువ పెట్టిన బంగారం గిల్టు బంగారం అని తేలింది. విచారణలో బసవరాజు నకిలీ బంగారాన్ని కుదువ పెట్టాడని నిర్ధారణ అయింది. దీంతో బసవరాజుకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.