రియల్ హీరో.. గజ బాధితులకు సూర్య 50 లక్షలు   - MicTv.in - Telugu News
mictv telugu

రియల్ హీరో.. గజ బాధితులకు సూర్య 50 లక్షలు  

November 19, 2018

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తి ప్రాణనష్టంతో పాటు తీవ్ర ఆస్తినష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తమిళనాడులో గజ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు ఏడు జిల్లాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసి, నష్టనివారణ చర్యల కోసం రంగంలోకి దిగింది.

Telugu News Hero Surya And Karthi Donate Rs 50 lakhs For Tamil Nadu Cm Relief Fund

తమిళనాడును ఆదుకునేందుకు సినీ, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, కార్రోరేట్ కంపెనీలు తమ వంతు బాధ్యతగా ముందుకొస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ టాప్ హీరో సూర్య కుటుంబం రూ.50 లక్షల భారీ విరాళాం ప్రకటించింది. హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక, తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ నలుగురు వారి వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ డబ్బును పంపించారు. కేరళ వరదల సమయంలోనూ హీరోలు సూర్య, కార్తిలు ముందుగా స్పందించి విరాళాలు అందజేశారు. ఇప్పుడు గజ తుపానుతో తమిళనాడు తీవ్రంగా నష్టపోవడంతో వారి వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు.

అలాగే మరో హీరో విజయ్ సేతుపతి రూ. 25 లక్షలు, డీఎంకే ట్రస్ట్ కోటి రూపాయలు, ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నెల జీతాన్ని ప్రకటించారు.

Telugu News Hero Surya And Karthi Donate Rs 50 lakhs For Tamil Nadu Cm Relief Fund