ఇవాంకాకు రాచమర్యాదలపై హీరోయిన్ ఫైర్... - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకాకు రాచమర్యాదలపై హీరోయిన్ ఫైర్…

November 29, 2017

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ట్రంప్ కూతురు  ఇవాంకా కోసం మన ప్రభుత్వాలు చేసిన హంగామాపై హీరోయిన్ మాధవీలత మండిపడింది. మన నాయకులకు  సాధారణ ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని, అయినా మనం సిగ్గులేకుండా మళ్లీ వాళ్లకే ఓటేస్తామని తీవ్ర విమర్శలు చేశారు తన ఫేస్ బుక్ పోస్ట్‌లో. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘మన హైదాబాద్‌కి ఇవాంకా ట్రంప్ వస్తుంది అంటే ఇంత హడావుడి.. క్లీనింగ్స్, పెయింటింగ్స్ అన్నీ చేశారు. మరి అమెరికాకి మన ప్రెసిడెంట్ వెళ్లినా కొత్తగా వాళ్లేమీ చెయ్యరు? వై? అంటే వాళ్లకు మన వాళ్లకు మనవాళ్లకి మర్యాద చేయడం తెలీదా? రాదా? లేక కొత్తగా హడావుడి చేసే అవసరం లేదా? అక్కడ ప్రజలందరి కోసం ఒకే రకమైన రోడ్స్.. ఉంటాయేమో..

విచ్ మీన్స్.. మనకే డెవలప్‌మెంట్ ఇంకా ఇంకా ఇంకా అవాలి అని అర్థం అయింది కదా. గవర్నమెంట్ కళ్లు తెరచి అతిథి కోసం కాదు ప్రజల కోసం ఎప్పుడు ఇలానే ఉండాలి. ఫెసిలిటీస్ అనుకుంటే కొత్త హంగులు చేసే అవసరం లేదు..మధ్యలో పోలీస్ ఓవర్ యాక్షన్.. సెక్యూరిటీ రీజన్స్ అని మన దేశంలో వీఐపీ ప్రాణాలకి తప్ప మామూలు మనుషులవి ప్రాణాలు కావేమో..

వీఐపీలు వచ్చి మనకు ఏం ప్రాజెక్ట్స్ తెస్తారో తెలీదు కానీ  మామూలు ప్రజల కష్టాలు ఎన్నో.. ఐనా మనకు సిగ్గు లేదు. అదే నాయకులకు ఓట్స్ వేస్తాం.. ఎవరో వస్తున్నారు అని రోడ్స్ వేస్తే అలా అయినా వచ్చాయి కదా అనే ఆనందం.. ఏంటో కర్మ.. మనకోసం వేస్తే ప్రౌడ్ గా ఫీల్ అవాలి కదా.. యామ్ అషేమ్డ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టయిలే..

నా పోస్టు ఎవరికి నచ్చినా నచ్చకున్నా నాకు అనవసరం, నాకు మన ప్రభుత్వ విధానాలు నచ్చలేదు.. దట్సాల్’ అని మాధవీలత తన ఫేస్‌బుక్ పేజీలో రాసింది.