mictv telugu

పెళ్లిగిళ్లీ జాన్తా నై.. జీవితాంతం కన్యగానే.. సాయిపల్లవి

February 8, 2019

సాయిపల్లవి.. డాన్సర్‌గా ప్రస్థానం మొదలు పెట్టి, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మలయాళ ‘ప్రేమమ్’ చిత్రంలో మలర్‌గా కనిపించిన సాయిపల్లవి.. ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగులో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాతో అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషాల్లో పలు చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయిన ఈ అమ్మడు.. తాను పెళ్లి అసలే చేసుకోనని, కన్యగానే మిగిలిపోతానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

Telugu News Heroine Sai Pallavi Says I Never Going To Marriage In Interview.

ఆమె ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ పెళ్లి గురించి తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పేసింది. తాను పెళ్లి చేసుకోనని, జీవితాంతం కన్యగానే ఉండిపోతానని తేల్చిచెప్పింది. ‘ నా జీవితంలో పెళ్లి గిళ్లి జాన్తా నై. మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ జీవితాంతం ఇలాగే ఉండిపోతాను’ అని చెప్పింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాయిపల్లవి తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్స్, ఆమె అభిమానులు సమర్ధిస్తున్నారు. సినిమా అవకాశాల కోసం ఎన్నడూ హద్దుదాటని హీరోయిన్లలో సాయిపల్లివి ఒకరని, ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని, అంటున్నారు. Telugu News Heroine Sai Pallavi Says I Never Going To Marriage In Interview