ఆ బూతును హీరోలూ పలికారు.. నన్నే తిడతారెందుకు? - MicTv.in - Telugu News
mictv telugu

ఆ బూతును హీరోలూ పలికారు.. నన్నే తిడతారెందుకు?

February 3, 2018

తమిళంలో వస్తున్న ‘ నాచియార్ ’ సినిమాపై విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. సినిమాలో నటి జ్యోతిక నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మధ్య విడుదలైన టీజర్‌లో జ్యోతిక తెవిదియా ( లం.. కొడుకులు ) అనే బూతు డైలాగును పలికింది. దీంతో మహిళా సంఘాలు దుమారానికి తెర లేపాయి.

‘ టీజర్ లోనే ఇంత పచ్చి బూతు మాట్లాడిందంటే ఇంక సినిమా మొత్తంలో ఇలాంటివెన్ని మాట్లాడి వుంటుందో ’ అని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నాచియార్ సినిమా విడుదలను అడ్డుకుంటామని కూడా బెదిరింపులకూ దిగుతున్నారు.  వ్యవహారం ఇప్పటికే కోర్టు మెట్లు కూడా ఎక్కింది.కాగా ఈ వివాదంపై జ్యోతిక స్పందించారు. ‘ టీజర్‌లో నేను చెప్పిన డైలాగ్‌ను పట్టుకుని ఇంత బీభత్సం చేస్తున్నారే.. మరి ఇప్పటికి ఎంతో మంది హీరోలు ఎన్నోసార్లు, ఎన్నో సినిమాల్లో ఈ పదాన్ని వాడారు.. అప్పుడు మీరందరు నోర్లెందుకు మూసుకున్నారు. వాళ్లు చెప్పినప్పుడు మీకు రైట్ అనిపించినప్పుడు.. నేను చెప్పినప్పుడు రాంగ్ అని ఎలా అంటారు..? సినిమా కథ నిమిత్తం అలాంటి మాటలు పలకాల్సి వచ్చింది. ఇంకా సినిమాలో కథ పరంగా ఇలాంటి మాటలు వున్నాయ్.. నేను చాలా వరకు తగ్గించే మాట్లాడాను.. దీని మీద ఎవ్వరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు ’ అని ఘాటుగా స్పందించారు. విలక్షణ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని వున్న సందర్భంలో ఇలాంటి వివాదం చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారింది.