హిజ్రాల సంక్షేమం కోసం 20 కోట్ల బడ్జెట్ - MicTv.in - Telugu News
mictv telugu

హిజ్రాల సంక్షేమం కోసం 20 కోట్ల బడ్జెట్

March 9, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల (హిజ్రాలు) సంక్షేమం కోసం ఈ బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించింది. గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం 26 వేల మందిని గుర్తించి పెన్షన్‌ స్కీమ్‌ వర్తింపజేసి ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.  సుమారు 80 వేల మంది ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రంలో వున్నారని గణాంకాల లెక్కలు చెబుతున్నాయి. వీరిలో కొంతమంది యాచక వృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఎక్కువమంది రేషన్ కార్డులు, సొంతిళ్ళు, హెల్త్ కార్డులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌పై ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.