mictv telugu

ఉప్పల్‌లో హిజ్రాల వీరంగం..  పోలీస్ స్టేషన్‌పై దాడి..

February 13, 2019

మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఉప్పల్ రింగ్‌రోడ్డు సమీపంలో హిజ్రాలు విధ్వంసం సృష్టించారు. బస్‌స్టాప్‌లో కార్లు ఆపిన వారిపై దాడికి దిగి తీవ్రంగా కొట్టారు. కారు అద్దాలను, కార్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చినవారినల్లా చితగ్గొట్టారు. వారి మెడలో వున్న బంగారు గొలుసులు, ఆభరణాలు, ఫోన్లు, పర్సులు లాక్కెళ్లిపోయారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమీపంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టారు. హిజ్రాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి అక్కడ కూడా నానా బీభత్సం సృష్టించారు. స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన ముగ్గురు పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు.

Telugu news Hijras beat up in Uppal..  attack on Police Station..

హిజ్రాలు ఎక్కువ సంఖ్యలో వున్నారు. సమయానికి స్టేషన్‌లో పోలీసులు అందుబాటులో లేకపోవడంతో వారిని ఆపడం పోలీసుల తరం కాలేదు. బూతులు తిట్టుకుంటూ.. నానా మాటలు అంటూ హంగామా చేశారు. తర్వాత స్టేషన్‌కు వచ్చిన సీఐ.. బాధితులు, గాయపడిన కానిస్టేబుళ్ల నుంచి ఫిర్యాదు తీసుకుని, వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ఆసుపత్రికి బయలుదేరిన బాధితులను కూడా కొంత దూరం వెంబడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Telugu news Hijras beat up in Uppal..  attack on Police Station.