సిద్దు తలనరికితే కోటి: హిందూ యువవాహిని - MicTv.in - Telugu News
mictv telugu

సిద్దు తలనరికితే కోటి: హిందూ యువవాహిని

December 6, 2018

మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధూపై హిందూ యువవాహిని సంస్థ సంచలన హెచ్చరిక చేసింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సిద్ధూ తీవ్ర విమర్శలు చేస్తున్నారని… ఆయన తలను నరికి తీసుకొచ్చిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తామని తెలిపింది. హిందూ యువవాహిని ఆగ్రా శాఖ అధ్యక్షుడు తరుణ్ సింగ్ మాట్లాడుతూ, సిద్ధూ ఆగ్రాకు వస్తే తల నరికేస్తామని హెచ్చరించారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా సిద్ధూ ప్రతిసారి మాట్లాడుతున్నారని… ఆయనకు భారత్‌లో ఉండే అర్హత కూడా లేదన్నారు. సిద్ధూను తామే పాకిస్థాన్‌కు పంపించేస్తామని తెలిపారు.ఆదివారం రాజస్థాన్‌లో జరిగిన ఓ ర్యాలీలో సిద్ధూ ప్రసంగిస్తూ…మోదీ ఒక దొంగ అని, యోగి ఒక భోగి అని అన్నారు. బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. చౌకీదారు కుక్క కూడా విశ్వాసాన్ని కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే, సిద్ధూకు వ్యతిరేకంగా హిందూ యువవాహిని ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలను చేపడుతున్నారు.