తెలంగాణలో వరుసగా 4 రోజులు సెలవులు… - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో వరుసగా 4 రోజులు సెలవులు…

December 6, 2018

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు వరుసగా నాలుగు రోజులు సెలవులు దొరుకుతున్నాయి. ప్రభుత్వం ఈ నెల 6,7 తేదీల్లో సెలవులు ప్రకటించగా, ఈ సెలవులు ముగియగానే రెండో శనివారం, ఆదివారం రానున్నాయి. దీంతో విద్యా సంస్థలకు వరుసగా 4 రోజుల సెలవులు దొరుకుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ఓటు వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. దీంతో వారికి కూడా 3 రోజులు వరుస సెలువులు రానున్నాయి. 8న రెండో శనివారం, 9న ఆదివారం కలిసి వస్తున్నాయి. ఓట్ల లెక్కింపు నిర్వహించే విద్యా సంస్థలు, కార్యాలయాలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు.Telugu news Holidays in Telangana for 4 days …