కామాంధుడి బారినుంచి తప్పించుకున్న ఐశ్వర్య

ప్రముఖ హాలీవుడ్ నిర్మాత  హార్వే వెయిన్‌స్టీన్ లైంగిక వేదింపులపై హాలీవుడ్‌లో పెద్ద దుమారం రేగుతోంది.  ఆ కీచకుడు తమనూ వేదించాడని ప్రముఖ హీరోయిన్లు ఏంజెలినా జోలి, గ్వైనెత్ పాల్టో తదితరులు ఆరోపించారు.  అంతేకాకుండా మెరిల్ స్ట్రిప్,  జెన్నిఫర్  లారెన్స్, కేట్ విన్స్‌లెట్‌లు కూడా వెయిన్‌స్టీన్‌పై అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. వెయిన్‌స్టీన్ 34 మంది మహిళలను వేదించినట్లు తెలుస్తోంది. ఈ  క్రమంలో…. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ని కూడా అతడు చెరబట్టేందుకు యత్నించినట్లు బయటపడింది. ఈ వివరాలను ఆమె మాజీ అంతర్జాతీయ వ్యవహారాల మేనేజర్ సిమన్ షెఫీల్డ్ చెప్పింది.

‘ఐశ్వర్య, వెయిన్‌స్టీన్ గతంలో పలు సందర్బాల్లో కలుసుకున్నారు. యామ్ ఫార్ కేన్స్  చిత్రోత్సవం  సందర్బాల్లో వారు కలసి ఫోటోలు దిగారు. ఐశ్వర్యను తాను ఒంటరిగా కలవాలనుకుంటున్నాను అని వెయిన్ స్టీన్ చెప్పాడు. కానీ నేను సమయస్పూర్తితో వ్యవహరించి ఐష్‌ను కాపాడాను’ అని సిమన్ ‘వెరైటి డాట్ కామ్’కు తెలిపింది.  ‘వెయిన్‌స్టీన్  ఓ వేధించే పంది. నేను,  వెయిన్‌స్టీన్, ఐష్ ముగ్గరం ఓసారి కలసి ఉన్నాం. అప్పుడు వెయిన్‌స్టీన్నన్ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నాడు. కానీ అతని ఉద్దేశాన్ని పసిగట్టిన నేను అందుకు మర్యాదగా నిరాకరించాను. మేం మీటింగ్ నుంచి వెళ్లిపోతున్నప్పుడు అతడు నన్ను అడ్డగించాడు. ఐశ్వర్యను ఒంటరిగా వదిలేయడానికి నీకెంత డబ్బుకావాలి అని అడిగాడు. నేను అందుకు తీవ్రంగా నిరాకరించాను’ అని సిమెన్ చెప్పింది. ఆ తర్వాత వెయిన్‌స్టీన్ తనని బెందించరించడని, అయినా ఆ కామాంధుడి నీడను ఐష్ మీద పడనీయలేదని అమె  పేర్కొంది.

SHARE