హోండా యాక్టివా 5G వచ్చేసింది ! - MicTv.in - Telugu News
mictv telugu

హోండా యాక్టివా 5G వచ్చేసింది !

February 7, 2018

ప్రముఖ మోటార్‌సైకిల్  సంస్థ హోండా యాక్టివా ఐదో జనరేషన్ మార్కెట్‌లోకి వచ్చేసింది. కొత్త‘ యాక్టివా 5జీ’ ఆటో‌ఎక్స్‌పోను ఈ రోజు ‘స్కూటర్  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ ఆవిష్కరించింది. కొత్త డీలక్స్ వేరియంట్ ఫుల్‌ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ,పొజిషన్ ల్యాంప్ ,కొత్త ఫ్రంట్ క్రొమ్ గార్నిష్‌తో ఈ ఐదవ జనరేషన్‌కు చెందిన యాక్టివాను మార్కెట్‌లోకి హోండా విడుదల చేసింది.

‘యాక్టివా5జీ ’ ఫీచర్లు

ఈ కొత్త యాక్టివా 5జీ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఒకటి డజెల్‌ యెల్లో మెటాలిక్‌, రెండు పెర్ల్ స్పార్టన్ రెడ్. అంతేకాక ఫ్రంట్‌ హుక్‌, సీట్‌ ఓపెనర్‌ స్విచ్‌తో 4-ఇన్‌-1 లాక్‌, కొత్త మఫ్లర్‌ ప్రొటెక్టర్‌లు కూడా ఉన్నాయి. మెకానికల్ పరంగా యాక్టివా 5జీ అలానే ఉండనుంది. 109సీసీ, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్, బీఎస్‌-4 ఇంజిన్‌ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఈ కొత్త స్కూటర్‌ మార్చ్‌లో మార్కెట్‌లోకి రానుందని సమాచారం. అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు.