గ్యాస్‌తో నడిచే స్కూటర్.. కేజీకి 95 కి.మీ. - MicTv.in - Telugu News
mictv telugu

గ్యాస్‌తో నడిచే స్కూటర్.. కేజీకి 95 కి.మీ.

February 1, 2018

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ రేట్లు..పొగతో వచ్చే కాలుష్యం, వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ప్రత్యామ్నాయం గ్యాస్‌తో నడిచే బండ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు. అయితే మనకు ఇదివరకు గ్యాస్‌తో నడిచే బస్సులు, కార్లు, ఆఖరికి ఆటోలు కూడా ఉన్నాయి. కానీ టూవీలర్లకు కూడా గ్యాస్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. హోండా ఆక్టివా సంస్థ దీనిని దృష్టిలో పెట్టుకుని ఇండియాలో రెండు సంవత్సరాల క్రితం విడుదల చేసిన సీఎన్‌జీ మోటార్ సైకిల్.రెండు చిన్న సిలెండర్లను బండికి ముందర అమర్చారు. ఒక సిలెండర్’లో కిలో గ్యాస్ నింపుకోవచ్చు. ఒక కేజీ గ్యాస్‌తో దాదాపు 95 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. సీఎన్టీ స్కూటర్లలో గ్యాస్ నింపేందుకు సీఎన్జీ స్టేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఈబండిని పెట్రోల్‌తో కూడా నడపవచ్చు. ఇప్పటికే ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పటికే ఈ సీఎన్జీ మోటర్ సైకిళ్ల రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. పెట్రోల్ కంటే ఈగ్యాస్‌తో40 శాతం తక్కువ ఖర్చు అవుతుంది.  ఈ సీఎన్‌జీ స్కూటర్ ధర 65000 వేలు.