యాక్టివా 5జీ వచ్చేసింది.   - MicTv.in - Telugu News
mictv telugu

యాక్టివా 5జీ వచ్చేసింది.  

March 16, 2018

ప్రముఖ మోటార్ వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ హోండా స్కూటర్స్ ఇండియా కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. ఆటో ఎక్స్‌పో 2018లో  యాక్టివా 5జీ పేరుతో సరికొత్త స్కూటర్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 0దీని ప్రామాణిక మోడల్ ధర రూ. 52,460 (ఎక్స్ ఫోరూం ఢిల్లీ), డీలక్స్ వెర్షన్ ధర రూ. 54,325(ఎక్స్ షోరూం ఢిల్లీ). స్కూటర్ల కోసం ఇప్పటికే  బుకింగ్స్ ప్రారంభమయ్యాయనీ, డెలివరీలను ప్రారంభిస్తున్నామని సంస్థ తెలిపింది.

ఫీచర్లు…

కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, ఇంటిగ్రేటెడ్‌  డేలైట్స్‌ను పొందుపర్చింది. డీలక్స్‌ వెర్షన్లో కొత్త డిజిటల్‌ అనలాగ్‌ మీటర్‌, 3 డీ ఎంబ్లమ్‌ను జోడించింది. 110 సీసీ నాలుగు-స్ట్రోక్ ఇంజిన్‌, 8బీహెచ్‌పీ పవర్‌,  9ఎన్‌ఎం టార్క్‌, గంటకు గరిష్టంగా 83 కి.మీ వేగం. సీవీటీ గేర్‌బాక్స్‌, రియర్‌ మోనోషాక్‌, కాంబీ ‍ బ్రేక్‌ సిస్టం,10-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ విత్‌ 90/100 ట్యూబ్ లెస్ టైర్లు   ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డాజిల్‌ ఎల్లో, పర్ల్ స్పార్టన్ రెడ్ రంగుల్లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.