లగ్జరీ బైకు ధర తగ్గించిన హోండా... - MicTv.in - Telugu News
mictv telugu

లగ్జరీ బైకు ధర తగ్గించిన హోండా…

April 10, 2018

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా తన లగ్జరీ మోటార్ సైకిళ్ల ధరలను బాగా తగ్గించింది. సీబీఆర్ 1000 ఆర్ ఆర్ ఫైర్ బ్లేడ్ మోడల్స్ ధరను రూ.2. 5 లక్షల తగ్గించినట్టు కంపెనీ ప్రకటిచింది. దిగుమతి చేసుకునే పూర్తిగా నిర్మితమైన యూనిట్ల( కంప్లీట్లీ బిల్ట్ యూనిట్)పై 25శాతం సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హోండా సీబీఆర్ 1000 ఆర్ఆర్ మోడల్ ధర రూ. 16. 79లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీ) నుంచి  రూ. 14. 78లక్షలకు తగ్గింది.ఫీచర్లు…

సీబీఆర్‌1000ఆర్‌ఆర్‌ ఎస్‌పీ మోడల్‌ ధర రూ. 21.22లక్షల(ఎక్స్‌షోరూం ఢిల్లీ) నుంచి రూ. 18.68 లక్షలకు(ఎక్స్‌షోరూం ఢిల్లీ) తగ్గింది. ఈ న్యూ జెనరేషన్‌ ఫైర్‌బ్లేడ్‌ మోడళ్లను హోండా గతేడాది భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.  ఇప్పటికే బీఎండబ్ల్యూ, డుకాటి, సుజుకీ, హర్లీ డేవిడ్‌సన్‌, యమహా కూడా తాము దిగుమతి చేసుకుంటున్న సీబీయూ ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.