డేరా బాబా ప్రియురాలు ఎక్కడ? - MicTv.in - Telugu News
mictv telugu

డేరా బాబా ప్రియురాలు ఎక్కడ?

September 12, 2017

హనీప్రీత్ సింగ్ ఎక్కడుంది ? ఏం చేస్తోంది ? డేరా బాబాకు రైట్ హ్యాండ్ అయిన ఈమె ఏ అండర్ గ్రౌండ్ లో దాక్కుంది ? పోలీసులకు ఇది చాలా చిక్కుగా మారింది. పంచకులలో 25 ఆగస్ట్ రోజున డేరా బాబా అరెస్ట్ అప్పుడు కనిపించిన హనీప్రీత్ సింగ్ తర్వాత కనిపించకుండా పోయింది. ఆమెను పట్టుకుంటే ఈ కేసులో ఇంకా కీలక ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు పోలీసులు.

హనీ ఫోన్ నంబర్ ను ట్రేస్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం  రాజస్థాన్ లోని పాక్  సరిహద్దులో ఉన్న సటే జిల్లా బాడ్ మేర్ లో వున్నట్టు గుర్తించారు. ఆమె నేపాల్ వెళ్ళి పోవాలనే ప్రయత్నంలో వున్నట్టు భావిస్తున్నారు. తండ్రీ – కూతుళ్ళుగా ఈ ప్రపంచానికి పరిచయమైన బాబా, హనీలబంధం అక్రమ సంబంధం అని ఆమె భర్త చెప్పాడు.