ప్రపంచంలోనే భారీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్    - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే భారీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్   

January 8, 2019

స్మార్ట్‌ఫోన్లలో మరో సంచలనం. మెగాపిక్సెల్స్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కెమెరాతో రూపొందించిన స్మార్ట్ ఫోన్ భారత్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ నెల 29న హానర్ బ్రాండ్‌కు చెందిన వ్యూ20 ఫోన్‌ను విడుదల చేయనున్నారు. ఇందులో 48ఎంపీ సోనీ ఐఎంఎక్స్589 సెన్సర్ ఉంటుంది. ఈ భారీ సామర్థ్యమున్న కెమెరాతో దృశ్యాలను మరింత స్పష్టంగా రికార్డు చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఇటీవలే చైనాలో ఆవిష్కరించారు. ధర రూ. 30 వేలు కాగా, హైఎండ్ వేరియంట్ రూ. 35 వేల వరకు ఉంటుంది.

Telugu news Honor V20 (View 20) officially announced with 48 MP camera.

హానర్‌  వి 20 ఫీచర్లు 

48ఎంపీ   రియర్‌కెమెరా, 2130×1080 పిక్చర్ రిజల్యూషన్‌, 6.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,  25 ఎంపీ సెల్ఫీ కెమెరా
హై సిలికాన్‌ కిరిన్‌ 980  ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ పై 9, 6జీబీ/8జీబీ ర్యామ్‌,128జీబీ/256 స్టోరేజ్‌, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీTelugu news Honor V20 (View 20) officially announced with 48 MP camera