ఆవులకు హాస్టళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఆవులకు హాస్టళ్లు

October 24, 2017

అదేంటి  విద్యార్థలు హాస్టళ్లు అని విన్నాం కానీ, ఆవులకు హాస్టళ్లు ఏంటి అని అనుకుంటున్నారా? అవును ఆవులకు హాస్టళ్లు కట్టే ఆలోచనలో ఉంది హరియాణా రాష్ట్ర ప్రభుత్వం. ఆవులు, గేదెల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతోంది. ‘పేయింగ్ గెస్ట్ హాస్టల్స్’ పేరిట రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు.

పట్టణ ప్రాంత ప్రజలు ఆవుల పెంపకం చేపట్టేందుకు, సొంతంగా పాల ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రభుత్వం చెబుతోంది. అపార్ట్‌మెంట్లలో ఉన్నవారికి ఆవుల పెంపకం చేపట్టేందుకు వీలుండదు.

 ఇలాంటి వారి కోసం పీజీ హాస్టల్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ప్రయత్నాలను విపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘మనుషుల కోసమే హాస్టల్స్‌ అని విన్నాం,  ఆవుల కోసం హాస్టల్స్‌ ఏమిటి? మనుషులు నివసించడానికే సరిగ్గా ఇళ్లు లేవు. ఇది ఒక ప్రచార ఎత్తుగడ మాత్రమే’ అని విపక్షాలు హర్యాణా ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.