పోర్న్ వీడియోలు చూడమంటూ.. ఆరు నెలలుగా అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం చోటు జరిగింది. ఓ ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుడు యువతులను వేధింపులకు గురిచేస్తున్నాడు.  అశ్విన్‌శర్మ అనే వ్యక్తి భోపాల్‌లో రెండు హాస్టల్స్ నడుపుతున్నాడు. ఇప్పటికే ముగ్గురు మహిళలు తమపై శర్మ అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.. తాజాగా మరో యువతి (20) శర్మ తనను రేప్ చేశాడని ఆరోపణలు చేయడంతో కలకలం రేపుతోంది…

Forced to watch porn, have unnatural sex

పోర్న్ వీడియోలు చూడమని బలంవంతం చేస్తూ.. తనపై ఆరు నెలలుగా అత్యాచారం జరిపాడని పేర్కొంది. తననే కాదు మిగతా అమ్మాయిలను కూడా హింసించాడని, వారందరూ భయంతో నోరు విప్పడం లేదని తెలిపింది. కాగా హాస్టల్ డైరెక్టర్ అశ్విని శర్మను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై బెదిరింపులు, తప్పుడు నిర్భదం, అమానుషాలను నిరోధించబడే నేరాల కింద కేసు నమోదు చేశారు. కాగా భోపాల్ నుంచి తప్పించుకొని ఇండోర్ వచ్చిన ఆ యువతి స్థానిక పోలీసులతో ఈ విషయాలను వెళ్లడించింది.