హాస్టళ్లకు సప్లై చేసే కూరగాయల్లో కూడా లంచం పురుగులు! - MicTv.in - Telugu News
mictv telugu

హాస్టళ్లకు సప్లై చేసే కూరగాయల్లో కూడా లంచం పురుగులు!

February 14, 2018

దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు  ఈరోజుల్లో లంచాలు పేరుతో చిన్న నుంచి పెద్ద దాక అందరూ దోచుకునేవాళ్లే. సర్కారు ఆఫీసు నుంచి మార్చురీలో ఉన్న శవాన్ని చూపించడానికి కూడా లంచం ఇవ్వాల్సిందే. అలా అయిపోయింది దేశంలో పరిస్థితి.

 

తాజాగా కరీంనగర్లో  లంచం తీసుకుంటూ హాస్టల్ వార్డెన్ అడ్డంగా దొరికిపోయాడు. కరీంనగర్లో ఉన్న సాంఘీక సంక్షేమ శాఖ వార్డెన్ శ్యాం సుందర్..సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య ఇద్దరూ కలిసి  హాస్టళ్లకు కూరగాయలను సప్లై చేసే వ్యక్తి దగ్గంర లంచంగా రూ.1.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.

వార్డెన్ శ్యాం సుందర్ సదరు వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనితో అవినీతికి పాల్పడిన వార్డెన్ శ్యాంసుందర్ మరియు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.