’మీరు అందంగా లేరా ? కానీ మీకు ఉద్యోగం కావాలా ? మరేం పర్లేదు మాదగ్గరకు రండి, మంచి కాల్ సెంటర్ ఉద్యోగం ఉంది. జీతం కూడా ఇరవై వేలకు పైనే..మీ ప్రతిభను బట్టి ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి’ ఇది భువనగిరిలో యువతులను ఆకర్షించడానికి కొందరు చేసే ఉద్యోగ ప్రకటనలు. ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో యువతులు ఉద్యోగంలో చేరతారు. వాళ్లతో పక్కాగా బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకుంటారు. ఆతర్వాత ఉద్యోగంలో చేరిన యువతులు చేసే పని తెలిస్తే మీరు షాక్ అవుతారు ?
ఇంతకీ వాళ్లు చెయ్యాల్సిన పని ఏంటంటే ఆ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన మగవారితో సెక్స్ సంభాషణలు చేయాలి. ఎంత ఎక్కువసేపు మాట్లాడితే అంత బాగా కస్టమర్‌ను తృప్తి పరిచినట్టు. అప్పుడు జీతం కూడా పెంచుతారు. ఇంక్రిమెంట్లు కూడా ఇస్తారు. అయితే ఎవరికైనా ఈ ఉద్యోగం చేయడం ఇష్టంలేక ఎదురు తిరిగితే ..పెట్టించుకున్న బాండ్ పేపర్లు బయటకు తీసి బెదిరిస్తారు.
భువనగిరి పట్టణం మీనానగర్లో ఈదందా చేస్తున్న వీరేశం,భవాని అనే ఇద్దరిని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన యువతి ఈ దందాలో జరిగే అఘాత్యాలను బయట పెట్టింది. ‘అక్కడ డబ్బుకు ఆశపడి ఎంతో మంది యువతులు ఇష్టం లేకపోయినా ఈ ఉద్యోగం చేస్తున్నారు. ఎదురు తిరిగితే కేవలం ఫోన్లో మాటలే కదా, ముఖం ఎవరికీ తెలియదు కదా ఎందుకు భయం అని చెప్పేవారు’ అని ఆయువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈదందా గురించి పోలీసులు మాట్లాడుతూ ‘హాట్ కాలింగ్’ పేరుతో జరుగుతున్న ఈ దందాలో కస్టమర్లనుంచి నెలకు రూ.5 వేలనుండి రూ.10 వేల వరకు తీసుకుని వారు ఫోన్ చేసినపుడల్లా యువతులతో డర్టీ టాకింగ్ చేయిస్తారు. ఈదందాతో ప్రమేయం ఉన్న అందరిని అరెస్ట్ చేస్తాం అని పోలీసులు చెప్పారు.