జీఎస్టీని నేనే తీశాను.. మీడియాకు బుద్ధిలేదు.. వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

జీఎస్టీని నేనే తీశాను.. మీడియాకు బుద్ధిలేదు.. వర్మ

February 19, 2018

జీఎస్టీని అసలు తాను తీయలేదని వర్మ చెప్పాడంటూ దాదాపు అన్నీ ఛానళ్ళలో వార్తలు ప్రసారమయ్యాయి. కాగా ఈ విషయంలో వర్మ మీడియా మీద ఘాటుగా స్పందించారు. ‘ జీఎస్టీని తెరకెక్కించిన ఘనత నాకే దక్కినప్పుడు.. అందులో నా భాగస్వామ్యం లేని పత్రికలు,ఛానళ్ళు ఎలా ప్రచురిస్తాయ్ ? అసత్యపు వార్తలను ప్రసారం చేస్తున్న కొందరు గాడ్, సెక్స్ అండ్  ట్రూత్‌ (జీఎస్టీ) నేను తీయలేదు. ఇలాంటి తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను ’ అంటూ వర్మ తన ట్విట్టర్ ద్వారా  నిలదీశారు.  ఈమేరకు ఓ జాతీయ పత్రిక కథనాన్ని ఆయన పోస్ట్‌ చేశారు.

జీఎస్టీని వర్మ డైరెక్ట్ చేయలేదు.. స్కైపీలో డైరెక్షన్ చేశారు.. ఈ సినిమాకు కేవలం తాను స్క్రిప్ట్ మాత్రమే అందించారు.. నిర్మాణంలో కూడా భాగస్వామ్యులయ్యారని.. వర్మ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసుల ముందు చెప్పారని కథనాలు వెలువడ్డాయి. అలాగే ఓ ప్రైవేట్ టీవీ ఛానళ్ళలో సైతం వర్మ తాను ఈ సినిమాను స్కైపీలో డైరెక్షన్ చేశానని చెప్పడం గమనార్హం. జీఎస్టీ విషయంలో  ఐద్వా నాయకురాలు మణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో వర్మ నోటీసులు అందకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ గత శనివారం సీసీఎస్‌లో హాజరయ్యారు. తదుపరి విచారణ శుక్రవారం ( 23వ తేదీ ) నాడు హాజరు కావాలని ఆదేశించారు.