శ్రీదేవి మరణం వెనుక ఎన్ని అనుమానాలో! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి మరణం వెనుక ఎన్ని అనుమానాలో!

February 27, 2018

శ్రీదేవి మరణంపై చిక్కుముడులు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి.  ఆమె మరణం వెనుక దాగున్న రహస్యాలను చేధించాలని దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలో వారు చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.పెళ్ళిలో ఆడిపాడిన శ్రీదేవి అంత లోనే అకస్మాత్తుగా ఎలా చనిపోతుంది ?

  • హోటల్‌ గదిలో మూడో మనిషికి తెలియంది  ఏం జరిగి వుంటుంది ? 
  • శ్రీదేవి చనిపోయినప్పుడు ఆమె చిన్న కూతురు ఖుషి ఎక్కడుంది ?

 

 • చెల్లెలు మహేశ్వరి కూడా శ్రీదేవితో వెళ్లింది.. అప్పుడు ఆమె ఎక్కడుంది ?

 

  • శ్రీదేవి అసలు ఎన్ని గంటలకు మరణించింది ?

 

 • ఆమెను హోటల్ గదిలో  ఒంటరిగా వదిలేసి అందరూ ఎక్కడికి వెళ్లినట్టు ?

 

  • పోలీసులకు సమాచారం అందటంలో ఆలస్యం ఎందుకు జరిగింది ? 
  • ఫోరెన్సిక్‌ నివేదిక రాకముందే గుండెపోటు అని ఎందుకు ప్రకటించారు ? 

 

 • ముందుగా హోటల్లో వున్న అత్యవసర వైద్య సదుపాయాన్ని ఎందుకు వినియోగించుకోలేదు ?

 

  • మద్యం ముట్టుకోని శ్రీదేవి కడుపులోకి ఆల్కహాల్‌ ఆనవాలు ఎలా వచ్చాయి?
  • హోటల్‌లోని సీసీ ఫుటేజీ ఎందుకు బయటకు రాలేదు ?

 

 • ఆస్తి తగాదాల కారణంగా భార్య భర్తల నడుమ వాగ్వాదం జరిగిందా ?

 

  • కుటుంబ సభ్యులు మీడియా ముందుకు ఎందుకు రాలేదు?
  • బోనీ ఎందుకు తిరిగొచ్చారు ?

 

 • హీరో అర్జున్ కపూర్ శ్రీదేవిని ఏమైనా ధూషించాడా ?

 

  • మార్వా పెళ్లిలో ఏమైనా గొడవ జరిగిందా ?

 

 • శ్రీదేవి ఎక్కువసార్లు ఫోన్ చేసి మాట్లాడిన వ్యక్తి ఎవరు ?

 

  • పెళ్లి 20వ తేదీన ముగిస్తే.. 24న ఆమె చనిపోయారు. ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగింది?

 

 • ఆమెకు ఏమైనా అనారోగ్య సమస్యలు వున్నాయా ?
 • బోనీ పెద్ద భార్య తరుపువాళ్ళు శ్రీదేవిని ఏమైనా అన్నారా ?

తదితర అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో పడ్డారు. పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ ప్రాసిక్యూషన్‌ అధికారుల చేతికి అందింది. దీంతోపాటు రెండో ఫోరెన్సిక్‌ నివేదిక వెలువడాల్సి ఉంది. వాటిని పరిశీలించాక అవసరమైతే శ్రీదేవి మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వివాహ వేడుక వీడియో ఫుటేజీలను తెప్పించుకున్న అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

మరోవైపు కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆమె పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్‌.. వంటి కారణాలు అయ్యి ఉండొచ్చన్న కోణంలో సైతం విచారణ చేపట్టేందుకు సిద్ధమైపోయారు. అటోప్సీ రిపోర్ట్‌ తోపాటు, బోనీ కపూర్‌ ఇచ్చిన వివరణపై ప్రాసిక్యూషన్‌ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బోనీ పాస్‌‌పోర్టును స్వాధీనపరుచుకున్నారు. శ్రీదేవి హెల్త్‌‌రికార్డ్స్‌ తేవాల్సిందిగా కుటుంబ సభ్యులను కోరిన అధికారులు.. ఆమె కాల్‌‌డేటా మొత్తాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.

హోటల్ గదిని సీజ్ చేసిన అధికారులు ఏం జరిగిందో తెలుసుకోడానికి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్, హోటల్ సిబ్బందిని సైతం ప్రశ్నిస్తున్నారు. మోహిత్‌  మార్వా కుటుంబాన్ని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.