శ్రీదేవి మృతి కేసు.. దుబాయ్ రాజు కూడా జోక్యం చేసుకోలేడు.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి మృతి కేసు.. దుబాయ్ రాజు కూడా జోక్యం చేసుకోలేడు..

February 27, 2018

నటి శ్రీదేవి మృతిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని తెలుస్తోంది. శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్టు ఆమె మరిది సంజయ్ కపూర్ చెప్పగా, దుబాయ్ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్‌లో  ‘ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతి చెందింది ’ అని పేర్కొన్నారు. దుబాయ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ పేరుతో విడుదలైన రిపోర్ట్ ప్రాథమిక నివేదిక మాత్రమేనని, పూర్తి రిపోర్టు రావాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. బోనీ కపూర్‌ను మూడు గంటల పాటు పోలీసులు విచారించారని ఇక్కడి మీడియా కోడై కూస్తోంది. దుబాయ్ మీడియా మాత్రం ఆయనను పోలీసులు ఇంటరాగేట్ చెయ్యలేదని వివరించింది. భారత్ మీడియా దగ్గర సరైన సమాచారం లేని నేపథ్యంలో ఊహాజనిత వార్తలు వెలుడుతున్నట్టు సమాచారం.గల్ఫ్‌ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులు బయటి వ్యక్తులెవరికీ వెల్లడించే వీలులేదు. ఒక కేసు విచారణలో వుండగా అందులో దుబాయ్ రాజు కూడా జోక్యం చేసుకోవటానికి వీలు లేదు. ఇలా మీడియాలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అవన్నీ నిరాధార కథనాలేనని, అక్కడి వాస్తవాలు ఎవరికీ తెలిసే అవకాశం లేదని దుబాయ్ చట్టాల గురించి అవగాహన వున్నవారు చెబుతున్నారు.