అర్జున్ రెడ్డిని కాపీ కొడుతున్న హౌరా బ్రిడ్జ్ - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ రెడ్డిని కాపీ కొడుతున్న హౌరా బ్రిడ్జ్

February 1, 2018

‘ అర్జున్ రెడ్డి ’ సినిమాను ఆదర్శంగా తీసుకుంది ‘ హౌరా బ్రిడ్జ్ ’ సినిమా యూనిట్. ఇంకేం..  హీరో హీరోయిన్లు కురుచ దుస్తుల్లో అసభ్యంగా కూర్చొని వున్న దృశ్యాలున్న పోస్టర్లను బస్సుల మీద, పెద్ద పెద్ద హోర్డింగ్‌లలో పెట్టి పబ్లిసిటీ మొదలు పెట్టారు. అర్జున్ రెడ్డి హాట్ కిస్ పోస్టర్ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హెచ్. హనుమంతరావు తీవ్ర విమర్శలు చేసినట్టుగానే ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ల మీద చాలా మంది విమర్శిస్తున్నారు. ప్రయాణికులు బస్సుల్లో ఎక్కటానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు నెలకొనడంతో వివాదం మరింత ముదురుతోంది. అర్జున్ రెడ్డి సినిమాకు వివాదం చెలరేగటంతో సెన్సార్ బోర్డ్ దానికి ‘ A ’ సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఎలా ఇచ్చిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.  

‘ అందాల రాక్షసి ’ ఫేం రాహుల్ రవీంద్ర, చాందినీ చౌదరీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కానుంది. రేవన్ యాదు దర్శకత్వం వహించారు. మార్కెట్లో సినిమా సక్సెస్ అవాలంటే యూత్‌ను టార్గెట్ చెయ్యాలి. అందులో భాగంగా ఇలాంటి పోస్టర్లతో సినిమాకు హైప్ పెంచుకుంటున్నారు తప్ప వాటివల్ల వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అని ఆలోచించటం లేదని పలువురు వాపోతున్నారు.