సెల్ఫీ కోసం బుల్లి ప్రింటర్ ..! - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీ కోసం బుల్లి ప్రింటర్ ..!

September 15, 2017

ప్రముఖ ప్రింటర్ల తయారీ సంస్థ హెచ్ పి సరికొత్త ప్రింటర్ ను లాంచ్ చేసింది.  ఈ ప్రింటర్ ముఖ్యంగా సెల్ఫీ  ప్రియుల కోసం ఫోటో ప్రింటర్ ను విడుదల చేసింది. భారీగా స్మార్ట్ ఫోన్ల వినియోగం, సెల్ఫీలపై యువతకు  ఉన్న క్రేజ్  నేపథ్యంలో” స్ప్రోకెట్ “పేరుతో  ఈ ప్యాకెట్ ప్రింటర్ ను స్మార్ట్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ధీని ధర రూ. 8.999 గా కంపెనీ నిర్ణయించింది. వినియోగాదారాలు ఆపిల్ యాప్ స్టోర్,గూగుల్ యెక్క ప్లే స్టోర్ నుంచి అధికార స్ప్రోకెట్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. బ్లూటూత్ ద్వారా దీన్ని స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకి మన ఫోటో ప్రింట్ వస్తుంది.

ఇది వినిమోగాదారులకు వారి అద్భుతమైన  మధుర క్షణాలను తక్షణమే ప్రింట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది 10-24 వయస్సు కలిగిన  లక్షాలదిమంది వినియోగాదారుల కోసం రూపొందించామని హెచ్ పి ఇండియా ప్రింటింగ్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ రాజా కుమార్ రిషి తెలిపారు. ఈ ప్రింటర్ ప్రస్తుతం ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో  లభిస్తుంది. దీన్ని అమెజాన్ ఇండియా వెబ్ సైట్ ద్వారా కొనుగొలు చేయవచ్చు.