రోడ్డుపై అప్పడాలు అమ్మిన హృతిక్ - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డుపై అప్పడాలు అమ్మిన హృతిక్

February 21, 2018

రబ్బరు బాడీబిల్డర్ హృతిక్ రోషన్ జైపూర్ వీధుల్లో సైకిల్ మీద అప్పడాలు అమ్ముతూ దర్శనమిచ్చాడు. హృతిక్ ఏంటీ.. అప్పడాలేంటీ..? అని ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం హృతిక్ ‘సూపర్ 30 ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా కథానుసారం హృతిక్ ఇలా అప్పడాల అవతారం ఎత్తాడన్నమాట. పూర్తి డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నాడు ఈ చిత్రంలో. ఇది హృతిక్ కెరియర్‌లో ఒక విభిన్నమైన చిత్రం.బిహార్‌కి చెందిన లెక్కల మాస్టారు ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గణితం మాస్టారు పాత్రలో హృతిక్ ఒదిగిపోయాడనటానికి ఇదే నిదర్శనం. ప్రతీ ఏడాది నిరుపేద కుటుంబానికి చెందిన 30 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులకు  ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు ఆనంద్ కుమార్. ఆయన పాత్ర పోషిస్తున్న హృతిక్ ఇలా జైపూర్ వీధుల్లో అప్పడాలు అమ్మాడు. వికాస్ బల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 29 జనవరి 2019 లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.