దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ ఢిల్లీలోని నరైనా ప్రాంతంలో గల ఓ గ్రీటింగ్ కార్డు తయారీ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టింది.
23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం కారణంగా ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఢిల్లీలో మూడు రోజుల్లో ఇది మూడో అగ్నిప్రమాద ఘటన. రెండు రోజుల క్రితం కరోల్ బాగ్లోని హోటల్ అర్పిత్ ప్యాలెస్లో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిన్న ఓ మురికివాడలో మంటలు చెలరేగి 250 గుడిసెలు దగ్దమయ్యాయి.Telugu News Huge Fire At Greeting Card Factory In Delhi Naraina Days After Deadly Hotel Blaze