నేను చెప్పిన అభ్యర్థికి ఓటేయవా.. భార్య వేలు నరికిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

నేను చెప్పిన అభ్యర్థికి ఓటేయవా.. భార్య వేలు నరికిన భర్త

December 8, 2018

రాజకీయలపై ఉన్న ప్రేమ కట్టుకున్న భార్యపై లేదేమో ఈ భర్తకు. నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను చెప్పిన అభ్యర్థికి ఓటు వేయలేదని భార్య వేలును నరికేశాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని సర్వాయిపేటలో చేసుకుంది. గ్రామంలోని భార్యభర్తలిద్దరూ ఓ పార్టీకి వేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లారు. ఓటేసి తిరిగి ఇంటికొచ్చారు. అయితే తన భార్య తాను చెప్పిన అభ్యర్థికి కాకుండా వేరే వారికి  ఓటు వేసిందని తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.Telugu News Husband Cut His Wife Finger At jayashankar Bhupalpally district ‘నేను చెప్పన పార్టీకి ఎందుకు ఓటు వేయలేదు’ అంటూ భార్యతో గొడవ పడ్డాడు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత గుర్తుగా సిర చుక్క పెట్టిన చూపుడు వెలిని నరకడానికి ప్రయత్నించాడు. దీంతో చిటికెన వేలు తెగిపోయింది.