ఆడపిల్లను కన్నదని భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపిల్లను కన్నదని భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు !

February 5, 2018

అతను చేసేది పేరుకు పెద్ద సాఫ్ట్ వేర్ జాబ్..కానీ భార్య ఆడపిల్లను కన్నదని పచ్చి బాలింతకు కరెంట్ షాక్ పెట్టే  మూర్ఖుడు. కృష్ణా జిల్లా పెనమలూరులో రాజారత్నం అనే సాఫ్ట్ వేర్, ప్రశాంతి అనే అమ్మాయిని నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  ప్రేమ దోమ అని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం బాగానే చేశాడు. కానీ ఆ తర్వాత అతనిలోని మృగం బయటికి వచ్చాడు. భార్యను వేదిస్తూ తరచూ అనుమానిస్తుండేవాడు. ఉద్యోగానికి వెళ్లినప్పుడు భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసుకెళ్లేవాడు. అతని చర్యలకు అతని తండ్రి కూడా వత్తాసు పలికేవాడు. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి.. భర్త ఎన్ని బాధలు పెట్టినా భరించి గుట్టుగా కాపురం చేస్తూ వచ్చింది ఆ ఇల్లాలు. ఈక్రమంలో భార్యకు మొదటి సంతానంగా బాబు జన్మించాడు. ఆతర్వాత రెండు సంవత్సరాలకు  మొన్న జనవరిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది.దీనితో  ఆడపిల్లను కంటావా అని కోపం పెంచుకున్న భర్త..భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమె చేతికి కరెంట్ తీగలు చుట్టి కరెంట్ షాక్ పెట్టాడు. పుట్టింటి నుంచి కట్నం తేవాలని లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మామలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తండ్రీ కొడుకులిద్దరూ  పరారీలో ఉన్నారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే చుట్టు ప్రక్కల స్థానికులు వాడు కూడా ఓ ఆడపిల్లకే పుట్టాడు కదా. మరి ఆడపిల్ల అంటే అంత ఈర్ష్య ఎందుకు అని వాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.