స్థలం విషయంలో వాగ్వాదం.. భార్యను చంపిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

స్థలం విషయంలో వాగ్వాదం.. భార్యను చంపిన భర్త

March 30, 2018

కూర్చొని శాంతంగా మాట్లాడకుంటే సర్దుమణిగే భూమి విషయం అది. లేనిపోని వాదోపవాదాలకు పోయారు. వాదులాటలో భర్త విచక్షణ కోల్పోయాడు.  క్ణణికావేశంలో భార్యను గొంతు నులిమి చంపాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన హైదరాబాదులోని కూకట్‌‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మల్లేపల్లి గ్రామానికి చెందిన శ్రీను కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ రాఘవేంద్ర సొసైటీలో నివాసం వుంటున్నాడు.అతని భార్య దేవి, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. స్థానిక పంజాగుట్టలోని డ్రై క్లీనింగ్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో దేవి తల్లి స్వగ్రామంలో భూమిని విక్రయించింది. ఈ విషయమై దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి వరకు ఇద్దరు వాదులాడుకున్నారు. ఆవేశానికి లోనైన శ్రీను దేవి గొంతు నులిమాడు. శ్వాస ఆడక ఆమె అక్కడికక్కడే చనిపోయింది. వెంటనే పోలీస్‌ స్టేషన్‌‌కు వెళ్లి లొంగిపోయాడు శ్రీను. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేవి మృతదేహాన్ని  గాంధీ ఆసుపత్రికి తరలించారు.