గోదాట్లోకి దూకి చావనా? అంటే.. చచ్చిపో అన్న భార్య - MicTv.in - Telugu News
mictv telugu

గోదాట్లోకి దూకి చావనా? అంటే.. చచ్చిపో అన్న భార్య

April 19, 2018

గృహ హింస అనగానే అందరికీ భర్త, అత్తమామలు, ఆడపడచులు పెట్టే హింసే కనిపిస్తుంది. అయితే రివర్స్‌లోకి వెళ్లి వాళ్లను కూడా వేధించే భార్యామణులు ఉంటారు. కొందరు భర్తలు బయటికి చెప్పులేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఒక భర్త.. భార్య వేధింపులు తాళలేక  గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

శ్రీకాకుళానికి చెందిన పిరియ కరుణ కుమార్ (32) పదేళ్ల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  కరుణ కుమార్ కార్ల వ్యాపారం చేసేవాడు. పెళ్లయినప్పటి నుంచి రమ్య రోజూ గొడవలు పెట్టుకునేది.. మంగళవారం కూడా ఘర్షణ జరిగింది. తర్వాత  కరుణ కుమార్ తన స్నేహితుడు వీరేంద్రతో కలిసి కొవ్వురూలో కారు కొందామని, బైక్‌పై వెళ్లారు. వంతెనపై ఫోన్‌లో మాట్లాడేందుకు బైక్ ఆపి, భార్యతో ఫోన్‌లో మాట్లాడాడు.

కరుణ కుమార్ భార్యతో మాట్లాడినప్పుడు..‘ఇంటికి రానా? లేక బ్రిడ్జి మీద నుంచి దూకి చావనా?’ అంటూ భార్యతో అన్నట్టు స్నేహితుడు పేర్కొంటున్నారు. దీనికి భార్య ‘దూకి చావు నీకు, నాకు ఏవిధమైన సంబంధమూ లేదు’ అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో విరక్తి చెందిన కరుణ కుమార్.. స్నేహితుడికి సెల్‌ ఫోన్‌ ఇచ్చి మూత్ర విసర్జన చేసి వస్తానని చెప్పి కొంత దూరం వెళ్లాడు. తర్వాత బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కరుణ కుమార్ కనిపించడం లేదన వీరేంద్ర.. రమ్యకు చెప్పాడు.  అయితే తనకు సంబంధం లేదని, వెళ్లి అతని తల్లిదండ్రలకు చెప్పండిని ఆవిడ జవాబిచ్చింది. తర్వాత 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాడు వీరేంద్ర. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కరుణ కుమార్ మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబసభ్యులకు అప్పగించారు.