mictv telugu

భార్య గెలిచిందని 120 మందికి ‘పంచాయతీ’ గుండ్లు

February 11, 2019

కోరిన కోరిక నెరవేరితే తలనీలాలు ఇస్తామని మొక్కుకోవడం మన దేశంలో కామన్. అందుకే తిరుమల, శ్రీశైలం, బెజవాడల్లో టన్నుల కొద్దీ కేశాలు పడతుంటారు. భక్తికి తోడు, ఎన్నికలు కూడా కలిస్తే విషయం మరింత రంజుగా ఉంటుంది.

Telugu news husband make tonsured 120 villagers for his wife victory in gram panchyat election of Medak district in Telangana

తన భార్య పంచాయితీ ఎన్నికల్లో గెలవాలని కోరుకున్న ఓ భర్త.. తన కోరిక ఫలించడంతో ఏకంగా 120 మందికి గుండ్లు కొట్టించాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్‌గా స్వరూప పోటీ చేసింది. ఆమె గెలిస్తే తిరుపతికి వస్తానని భర్త శ్రీనివాస్ వెంకన్నకు మొక్కుకున్నాడు. స్వరూప గెలవడంతో.. ఊర్లోని 120 మంది మూడు బస్సులో వెంటబెట్టుకుని తిరుపతి వెళ్లాడు. వాళ్లందరికీ సొంతఖర్చులతో గుండ్లు కొట్టించాడు. దీనిపై సదరు గుండు భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులివ్వడం మామూలేనని, అయితే ఇలా సొంత ఖర్చులతో జాగ్రత్తగా కొండకు తీసుకొచ్చి గుండు కొట్టించే వాళ్లు చాలా అరుదని శ్రీనివాస్ ను పొగుడుతున్నారు. Telugu news husband make tonsured 120 villagers for his wife victory in gram panchyat election of Medak district in Telangana