భోజనం వేడిగా లేదని భార్యను నరికేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

భోజనం వేడిగా లేదని భార్యను నరికేశాడు

November 30, 2017

లోకంలో భార్యను ప్రేమగా చూసుకునే భర్తలు ఉంటారు, భార్యను బానిసలుగా చూసే భర్తలూ ఉంటారు. వీడేరకమో మీరే అర్థం చేసుకోండి. పాకిస్థాన్‌లో సర్గోదాలోని ఛాక్‌ ప్రాంతానికి చెందిన ఫిరోజ్‌ ఖాన్‌ బయట పనులు ముగించుకుని రాత్రి ఇంటికొచ్చాడు. ఆకలిగా ఉందిని భార్యను అన్నం వడ్డించమన్నాడు. పాపం భర్త ఎంత ఆకలితో ఉన్నాడో అని అతని భార్య రోషన్ బీబీ పరుగు పరుగున వంటింట్లోకి వెళ్లి  భోజనం తెచ్చి పెట్టింది. అయితే భోజనం చల్లారిపోవడంతో భార్యతో గొడవకు దిగాడు ఫిరోజ్.మాటా మాటా పెరిగింది. ఇంతలో గొడ్డలి తీసుకు వచ్చి భార్యను అతి కిరాతంగా నరికాడు. ఆ తర్వాత అక్కడినుండి పరారయ్యాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి, ఆమె బంధువులకు అప్పజెప్పారు.  కేసు నమోదు చేసుకుని  పరారీలో ఉన్న భర్తకోసం గాలిస్తున్నారు.